భూపాలపల్లిలో జాతీయ పోషణ మాసోత్సవాలు

భూపాలపల్లి CDPO ఆఫీస్‌లో 9వ జాతీయ పోషణ మాసోత్సవాలు జరిగాయి. ఈ ప్రోగ్రామ్‌లో మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, జిల్లా సంక్షేమాధికారి మల్లేశ్వరి పాల్గొన్నారు. తల్లులు, పిల్లల్లో అనీమియా (రక్తహీనత) తగ్గించేలా అవేర్‌నెస్ తేవాలని సూచించారు. గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు రెండేళ్ల వయస్సు వరకు తొలి 1,000 రోజులు చాలా కీలకమని, పౌష్టికాహారంతో పాటు పరిశుభ్రత పాటించాలని చెప్పారు.



