తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రభుత్వ ప్రాధాన్యం

గుంటూరు జిల్లా మంగళగిరిలో గర్భిణీలకు శ్రీమంతం జరిగింది. ఎర్రబాలెం జంగాల కాలనీ అంగన్వాడీ కేంద్రంలో డాక్టర్ రాధా మాధవి, ఆకుల జయసత్య పాల్గొన్నారు. తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలని, వైద్యుల సూచనలు పాటించాలని సూచించారు. అంగన్వాడీ సిబ్బంది సేవలను అభినందించారు. గర్భిణీలు, టీచర్లు, ఆయాలను శాలువాలతో సత్కరించారు.



