చనిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం

TG: కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్‌కు చెందిన రఘు (33) నెలరోజుల క్రితం వడదెబ్బకు గురై మృతి చెందాడు. ప్రైవేట్ స్కూల్ వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆయన మూడునెలల క్రితం RTC డ్రైవర్ పోస్టుకు దరఖాస్తు చేసి పరీక్షలు పూర్తి చేశాడు. తాజాగా విడుదలైన ఫలితాల్లో రఘు ఎంపికైనట్లు అధికారులు సమాచారం అందించారు. అయితే ఆ ఉద్యోగాన్ని అందుకునేలోపే అతడు మృతి చెందడంతో భార్య రజిత, ఇద్దరు కుమార్తెలు కన్నీరుమున్నీరయ్యారు. రఘు కుటుంబానికి ఆర్థికసాయం, అతని భార్యకు RTCలో ఉద్యోగం కల్పించాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరారు.



