వాట్సాప్‌లో పరిచయం.. నమ్మించి లక్షల్లో మోసం

TG: హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టకు చెందిన సురేందర్‌రెడ్డికి ఎప్రిల్ నెలలో ఓ వాట్సాప్ గ్రూప్‌లో గీతాంజలి, శుభమ్, అమిత్ పేర్లతో ముగ్గురు పరిచయం అయ్యారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ చేస్తే భారీ లాభాలు వస్తాయని నమ్మించి ఒక ‘APK ఫైల్’ను పంపించారు. దానిపై క్లిక్ చేయించి ట్రేడింగ్ ఖాతాలు తెరిపించారు. బాధితుడు దశలవారీగా ట్రేడింగ్ ఖాతాల్లో రూ.8.55 లక్షలు జమచేశాడు. మే నెలలో జమచేసిన డబ్బును సురేందర్ విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించగా, ఇంకా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలని వారు డిమాండ్ చేశారు. దీంతో సురేందర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.



