← Back to news

ఆటోను ఢీకొట్టి షాపుల్లోకి దూసుకెళ్లిన బస్సు

By డీకే· 3 Jul 2026· నెల్లూరు జిల్లా
ఆటోను ఢీకొట్టి షాపుల్లోకి దూసుకెళ్లిన బస్సు

AP: నెల్లూరు జిల్లా కోట మండలంలోని చంద్రశేఖరపురం వద్ద ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి ముందు వెళ్తోన్న ఆటోను బలంగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా రోడ్డు పక్కనున్న దుకాణాలు, పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర దుర్ఘటనలో ఇద్దరు యువకులు స్పాట్‌లో ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు కేశవరం గ్రామానికి చెందిన శివ (22), వంజివాక గ్రామానికి చెందిన వినోద్ (21)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More in AP