దళిత మహిళపై దాడి.. నిందితులను శిక్షించాలి

రంగారెడ్డి జిల్లా నోముల గ్రామంలో మూఢనమ్మకాల పేరుతో దళిత మహిళ పలాటి వెంకటమ్మ పై 17 మంది దాడి చేసిన ఘటనను 'కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి' నాయకులు పరిశీలించారు. బాధితురాలిని ఇంట్లో నుంచి లాక్కొచ్చి కొడుతూ, వేపచెట్టుకు కట్టేసి దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చేతబడి పేరుతో దళితులపై దాడులు చేయడం దారుణమని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.



