బైండోవర్ ఉల్లంఘించడంతో జైలుశిక్ష

TG: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దూరాజిపల్లి గ్రామంలోని తెళ్లబండ కాలనీకి చెందిన రాపాణి శ్రీనుపై ఓ గొడవ కేసులో చివ్వెంల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సత్ప్రవర్తనతో మెలుగుతానని మండల మేజిస్ట్రేట్ వద్ద రూ.3లక్షల పూచీకత్తుతో బైండోవర్ చేసుకున్నాడు. అయితే శ్రీను బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి తిరిగి నేరానికి పాల్పడ్డాడు. ఈ మేరకు చివ్వెంల పోలీసులు మరో కేసు నమోదు చేసి అతడిని మండల న్యాయవాది ముందు హాజరుపరిచారు. పూచీకత్తు మొత్తం రూ.3లక్షల జరిమానా విధించగా, చెల్లించలేకపోవడంతో తహశీల్దార్ ఉత్తర్వుల మేరకు 45రోజులు జైలుకు తరలించారు.



