← Back to news

సెలవులపై వచ్చిన ఆర్మీ ఉద్యోగి హత్య

By DK· 8 Jun 2026· News18· మెదక్
సెలవులపై వచ్చిన ఆర్మీ ఉద్యోగి హత్య

TG: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ ఆర్మీ ఉద్యోగి హత్యకు గురయ్యాడు. మెదక్ జిల్లా ర్యాలమడుగు విలేజ్‌కు చెందిన కుమార్ గౌడ్(49) ఇండియన్ ఆర్మీలో సుబేదార్‌గా ఉత్తరాఖండ్‌లో డ్యూటీ చేస్తున్నాడు. ఆయన భార్య పద్మ, ఇద్దరు కుమార్తెలతో మెదక్‌లో నివాసం ఉంటోంది. గతనెల 11న సెలవులపై ఇంటికి వచ్చిన కుమార్ గౌడ్, ఈ నెల 10న తిరిగి డ్యూటీకి వెళ్లాల్సి ఉంది. కొంతకాలంగా కుమార్ గౌడ్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని పద్మ, తన కుటుంబసభ్యులతో కలిసి కర్రలతో దాడిచేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.