← Back to news

ఘోర ప్రమాదం.. డ్రైవర్ సజీవ దహనం

By DK· 11 Jun 2026· Hmtvlive· నిర్మల్ జిల్లా
ఘోర ప్రమాదం.. డ్రైవర్ సజీవ దహనం

TG: నిర్మల్ రూరల్ మండలం మేడిపల్లి వద్దనున్న నేషనల్ హైవేపై రెండు లారీలు ఢీకొన్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. నాగ్‌పూర్ వైపు నుంచి ఆలుగడ్డల లోడ్‌తో హైదరాబాద్ వైపు వస్తున్న లారీ టైర్ పంచర్ కావడంతో హైవే పక్కన నిలిపివేశాడు. జొన్నల లోడ్‌తో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళుతున్న లారీ, పక్కన నిలిపి ఉంచిన లారీని వేగంగా ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలానికి చెందిన లారీ డ్రైవర్ జవారి సింగ్ లారీ క్యాబిన్‌లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.