ఆడిట్‌లో దొరికిపోతానని ఆత్మహత్య

TG: రంగారెడ్డి కలెక్టరేట్‌లో ఉద్యోగిగా పనిచేసిన శ్రీధర్‌బాబు ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫస్ట్ అతనిది సాధారణ ఆత్మహత్యగా భావించినా కేసు దర్యాప్తులో భారీ ఆర్థిక అక్రమాలు బయటపడ్డాయి. జిల్లా ట్రైబల్ శాఖకు సంబంధించిన నిధులను అక్రమంగా ఇతర ఖాతాలకు బదిలీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా ట్రైబల్ అధికారిణి సంతకాలను శ్రీధర్ బాబు ఫోర్జరీ చేసి రూ.33 లక్షల ప్రభుత్వ నిధులు స్వాహా చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారం ఆడిట్‌లో బయటపడే అవకాశం ఉండటంతో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.




