మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్

TG: వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ తరహాలో అభివృద్ధి చేయనున్నారు. ఈ విమానాశ్రయం నిర్మాణానికి కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రన్‌వే పునర్నిర్మాణం, కొత్త ఏప్రాన్, లింక్ టాక్సీవే, ఐసోలేషన్ బే, పెరిమీటర్ రోడ్డు, ఎమర్జెన్సీ యాక్సెస్ రోడ్డు తదితరాల నిర్మాణం కోసం రూ. 2,034 కోట్ల అంచనా వయ్యంతో.. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) టెండర్లను ఆహ్వానించింది. ఈ పనులను 15 నెలల్లోగా పూర్తిచేయాలని పేర్కొంది. విమానాశ్రయ నిర్మాణం కాకతీయ వైభవాన్ని ప్రతిబింబించేలా ఉండాలని CM రేవంత్ విజ్ఞప్తి చేయగా.. అందుకు కేంద్రం ఒకే చెప్పింది.



