వరంగల్ నుంచి తొర్రూర్‌కు బస్సు సౌకర్యం కల్పించాలి
TG: రాత్రి 8గంటలు దాటితే వరంగల్ నుంచి తొర్రూర్, వర్ధన్నపేట ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, ఇతర పనుల కోసం వరంగల్‌కు వచ్చే ప్రజలు రాత్రివేళ స్వగ్రామాలకు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ రవాణాపై ఆధారపడాల్సి వస్తోంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాత్రి 9గంటల తర్వాత వరంగల్ నుంచి తొర్రూర్‌కు ఒక బస్సును నడపాలని కోరారు.


