కరెంట్ షాక్‌తో తండ్రీకూతురు స్పాట్‌డెడ్

TG: హైదరాబాద్‌లోని అల్వాల్ పరిధిలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి టెలికాంకాలనీలో సందీప్ కారుపై ఓ పెద్ద చెట్టుకొమ్మ విరిగి పడింది. శనివారం ఉదయం కారుపై పడ్డ చెట్టుకొమ్మలను తొలగించేందుకు సందీప్ తన కుమార్తె రితికతో కలిసి ప్రయత్నించారు. కొమ్మలను లాగుతుండగా పచ్చికొమ్మలు పక్కనే ఉన్న హైవోల్టేజ్ కరెంట్ వైర్లు తగిలాయి. చెట్టుకొమ్మల ద్వారా విద్యుత్ ప్రసారమవ్వడంతో తండ్రీకూతురు కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిని కాపాడేందుకు సందీప్ భార్య శ్వేత ప్రయత్నించగా, ఆమె కూడా షాక్‌కు గురై స్వల్ప గాయాలతో బయటపడ్డారు.



