లవర్ కోసం కన్న కొడుకునే చంపేసిన తల్లి!

సిద్దిపేట జిల్లాకు చెందిన స్వామి, జ్యోతి దంపతులు తమ రెండేళ్ల కొడుకు హరికృష్ణతో కలిసి కీసర పోలీస్ స్టేషన్ దగ్గర్లో ఉంటున్నారు. అయితే జ్యోతికి నవీన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. భర్త ఇంట్లో లేని టైమ్‌లో ప్రియుడిని ఇంటికి పిలిచేది. వారు కలిసి ఉన్నప్పుడు బాబు ఏడుస్తుండడంతో నవీన్ చిరాకు పడ్డాడు. బాబును చంపేద్దామని నవీన్ అనడంతో జ్యోతి కూడా ఓకే చెప్పింది. ఇద్దరూ కలిసి బాబును కిందపడేసి కొట్టి చంపేశారు. ఫిట్స్ వచ్చి చనిపోయాడని నమ్మించారు. కానీ తండ్రికి డౌట్ రావడంతో 20 రోజుల తర్వాత ఈ నిజం బయటపడింది. ప్రెజెంట్ జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రియుడు నవీన్ పరారీలో ఉన్నాడు.



