← Back to news

గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

By DK· 8 Jul 2026· విశాఖపట్నం జిల్లా
గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

AP: విశాఖ సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున తక్షణ సాయం అందించనుంది. చేపల వేటకు వెళ్లిన మత్య్సకారులు తిరిగి వస్తున్న క్రమంలో ఈ నెల 4న వారి బోటు గల్లంతైంది. బోటులో మొత్తం ఏడుగురు ఉండగా వారిలో ఒకరు బోటును పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారు. మరో ఆరుగురు సముద్రంలో గల్లంతు అయ్యారు. ఇప్పటి వరకు వారి ఆచూకీ దొరకలేదు. గల్లెంతైనవారి కోసం కోస్ట్ గార్డ్‌లు, పోలీసులు చర్యలు చేపట్టారు. సెర్చ్ ఆపరేషన్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

More in AP