‘ఫంక్షన్‌లో బండి భగీరథ్ డ్యాన్స్’ అంటూ వీడియో వైరల్
TG: పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొడుకు బండి భగీరథ్ జూలైలో షరతులతో కూడిన బెయిల్ మీద బయటకొచ్చాడు. ఇన్నాళ్లూ అతనికి సంబంధించిన వివరాలేవీ బయటకు రాలేదు. తాజాగా తన కజిన్ పెళ్లిలో అతను డ్యాన్స్ చేస్తున్నాడంటూ రెండు సెకండ్ల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉన్నది భగీరథే అయినా, ఇది పాత వీడియోనా లేక లేటెస్ట్ వీడియోనా అనేది తెలియడం లేదు.



