నరసింహపురంలో 'పచ్చ పండగ'

పోలవరం జిల్లా చింతూరు మండలం నరసింహపురంలో 'పచ్చ పండగ'ను ఆదివాసీలు సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. గ్రామ దేవతలకు పూజలు చేసిన తర్వాతే మొక్కజొన్నలు, చిక్కుడు కాయలు, ఇతర కూరగాయలను ఆహారంగా తీసుకోవడం స్టార్ట్ చేస్తారని పూజారి ముచ్చిక సింగయ్య తెలిపారు. పూర్వీకుల నాటి ఆచారాలను భవిష్యత్ తరాలు కూడా కాపాడుకోవాలని గ్రామస్తులకు సూచించారు.




