సెకండ్ ఫ్లోర్ నుంచి కిందపడ్డ లిఫ్ట్.. లిఫ్ట్‌లోనే MLA

TG: మానకొండూరు MLA కవ్వంపల్లి సత్యనారాయణకు పెను ప్రమాదం తప్పింది. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ బర్త్ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు కవ్వంపల్లి సత్యనారాయణ వెళ్లారు. వేడుకలు ముగించుకుని భవనంలోని సెకండ్ ఫ్లోర్ నుంచి లిఫ్ట్‌లో కిందకు వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తి లిఫ్ట్ ఒక్కసారిగా కిందికి పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, అనుచరులు లిఫ్ట్ తలుపులు తెరిచి లోపల ఉన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌లను సురక్షితంగా బయటకు తీశారు.



