170 నిమిషాల్లో..అగ్గిపెట్టెలో పట్టే చేనేత చీర

TG: ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ చేనేత మగ్గంపై 170 నిమిషాల్లో అగ్గిపెట్టెలో పట్టే చీరను నేశారు. 5.5 మీటర్ల పొడవు, 45 అంగుళాల వెడల్పు, 175 గ్రాముల బరువు ఉన్న ఈ చీర అందరినీ ఆకట్టుకుంటోంది. హరిప్రసాద్ గతంలో ‘నారీ శక్తి’, ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ వంటి ప్రత్యేక థీమ్‌లతో చీరలు నేసి ప్రశంసలు పొందారు.



