← Back to news

మామిడిపండ్లు తిని అక్కాచెల్లెళ్లు మృతి

By DK· 11 Jun 2026· Samayam· హైదరాబాద్‌
మామిడిపండ్లు తిని అక్కాచెల్లెళ్లు మృతి

TG: మామిడిపండ్లు తిన్న తర్వాత అస్వస్థతకు గురై ఆస్పతిపాలైన అక్కాచెల్లెళ్లు చికిత్స పొందుతూ మరణించారు. కర్ణాటకలోని బీదర్‌కు చెందిన వైజినాథ్, ఇందుమతి దంపతులకు మొత్తం నలుగురు కుమార్తెలు. వీరు ఉపాధి కోసం బీదర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. నారాయణగూడలోని విఠల్‌‌వాడి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఇద్దరు కుమార్తెలు భువనేశ్వరి (17), సంధ్య (10) మామిడి పండ్లను తిని అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతూ మృతి చెందారు.

More in TG