← Back to news

చీకటి GOలతో కార్మికుల పొట్టకొట్టొద్దు

By డీకే· 23 Jun 2026· Sakshi· విజయవాడ
చీకటి GOలతో కార్మికుల పొట్టకొట్టొద్దు

AP: మున్సిపాలిటీల్లో మంచినీటి సరఫరా, వీధిదీపాలు, పార్కులు, రోడ్లు, వాహనాలు వంటి 14రకాల సేవలను ప్రైవేట్‌పరం చేసేందుకు AP ప్రభుత్వం రెడీ అవడంపై కార్మికులు ఫైరవుతున్నారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల నుంచి తరలివచ్చిన కార్మికులంతా విజయవాడ ధర్నాచౌక్‌ వద్ద నిరసన తెలిపారు. AP మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం కోర్టు తీర్పులను సైతం తుంగలో తొక్కుతూ చీకటి GOలతో మున్సిపల్ కార్మికుల పొట్టకొట్టేందుకు సిద్ధమైందన్నారు.

More in AP