డిజిటల్ అరెస్ట్.. రూ.10 కోట్లు మాయం!

AP: విజయవాడలో భారీ ‘డిజిటల్ అరెస్ట్’ మోసం బయటపడింది. CBI, ముంబై క్రైమ్ బ్రాంచ్, ట్రాయ్ అధికారులమంటూ సైబర్ నేరగాళ్లు బాధితుడిని భయపెట్టారు. కేసులో ఇరుక్కున్నారని చెప్పి, ‘వెరిఫికేషన్’ పేరుతో విడతలుగా 10 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఇందులో 7 కోట్ల రూపాయలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


