← Back to news

AIపై హరారి హెచ్చరిక

By Siddu vinay· 3 Aug 2026· Youtube
AIపై హరారి హెచ్చరిక

ప్రపంచ ప్రఖ్యాత చరిత్రకారుడు, రచయిత <a href="https://en.wikipedia.org/wiki/Yuval_Noah_Harari">యువాల్ నోవా హరారి</a> ఇటీవల AI భవిష్యత్‌పై జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు. AI ఇక కేవలం టూల్ కాదు.. సొంతంగా నిర్ణయాలు తీసుకునే ఏజెంట్‌గా మారుతోందన్నారు. ఇది భాష, ప్రభుత్వ వ్యవస్థలు, ప్రజాస్వామ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు. అందుకే AI Safety, కఠిన నియంత్రణలు, నిజాన్ని గుర్తించే సామర్థ్యంపై ఇప్పటి నుంచే పెట్టుబడులు పెట్టాలని సూచించారు.

More in Science

నిద్రలో ఒక్కసారిగా కింద పడుతున్నట్టు ఎందుకు అనిపిస్తుంది? 💤
Science· 21 Aug 2026

నిద్రలో ఒక్కసారిగా కింద పడుతున్నట్టు ఎందుకు అనిపిస్తుంది? 💤

నిద్రలోకి జారుకుంటున్నప్పుడు ఒక్కసారిగా కింద పడుతున్నట్టు అనిపించి ఉలిక్కిపడటం చాలామందికి జరుగుతుంది. దీనిని ‘హిప్నిక్ జర్క్’ అంటారు. నిద్రలోకి మారే సమయంలో కండరాలు ఒక్కసారిగా జర్క్ అవడం వల్ల ఈ అనుభూతి వస్తుంది. మనం నిజంగా పడిపోతున్నామని కాదు.. మెదడు, శరీరం మేల్కొనే స్థితి నుంచి నిద్రలోకి మారుతున్న సమయంలో వచ్చే సహజ స్పందన ఇది. ఒత్తిడి, నిద్రలేమి, ఎక్కువ కెఫీన్ వంటివి దీన్ని మరింత పెంచొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అప్పుడప్పుడు ఇలా జరగడం సాధారణమే. మీకు కూడా ఇలా జరిగిందా? కామెంట్‌లో చెప్పండి. 👇