ఫెస్టివల్ వైబ్స్.. తరలివస్తున్న గణనాథులు!
సోమవారం వినాయకచవితి సందర్భంగా.. దేశవ్యాప్తంగా గణనాథులు తరలివస్తున్నారు. హైవేలు, రోడ్లన్నీ.. వాహనాలపై వస్తున్న వినాయక విగ్రహాలతో కనిపిస్తున్నాయి. రకరకాల గణేశ విగ్రహాలను మండపాలకు తరలిస్తున్నారు. ఊరూ, వాడా ఎక్కడ చూసినా ఫెస్టివల్ వైబ్ కనిపిస్తోంది. డప్పుల చప్పుళ్లు, గణపతి బప్పా మోరియా నినాదాలు వినిపిస్తున్నాయి. మార్కెట్లలో సందడి కనిపిస్తోంది. పండ్లు, పూలు, పత్రిని కొంటూ ప్రజలు బిజీగా ఉన్నారు. మీరు కూడా మీ ఊరి మట్టి లేదా సీడ్ గణేశ్‌తో ఫొటోలు తీసుకొని మాకు పంపండి. మేం అందరికీ చూపిస్తాం.



