20s లో “తర్వాత”.. 30s లో “ఇప్పుడే”!

20s లో మన రోజులను మనమే ప్లాన్ చేస్తాం.. 30s లో మన బాధ్యతలే మన రోజులను ప్లాన్ చేస్తాయి. 20s లో టైమ్ ఎక్కడ ఖర్చవుతుందో పెద్దగా పట్టించుకోం.. “రేపు చేసుకుందాం” అనుకుంటాం. కానీ 30s లోకి వచ్చేసరికి కెరీర్, డబ్బు, రిలేషన్‌షిప్స్, ఫ్యామిలీ, భవిష్యత్తు.. అన్నీ మన టైమ్ కోసం పోటీ పడతాయి. అందుకే 30 నుంచి 45 ఏళ్ల దశను సైకాలజీలో ‘రష్ అవర్ ఆఫ్ లైఫ్’ అంటారు. 20s లో మనం కోల్పోయింది టైమ్ కాదు.. దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియని రోజులు. డబ్బు పోతే మళ్లీ సంపాదించొచ్చు.. కానీ గడిచిపోయిన టైమ్‌ను..?

