← Back to news

చేతబడి అనుమానంతో వృద్ధురాలికి చిత్రహింసలు.. దారుణం!

By Mahesh· 1h ago· TG

TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెంలో దారుణ ఘటన లేట్‌గా బయటకు వచ్చింది. చేతబడి చేసిందన్న అనుమానంతో SK సకినా బీ అనే వృద్ధ మహిళను గ్రామస్తులు చిత్రహింసలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తాళ్లతో కొట్టి, చెట్టుకు మేకులు కొట్టి ఆమెను పైకి ఎక్కించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి నిజాలను బయటకి తేవాలని, బాధితురాలికి రక్షణ కల్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

More in TG

మల్కాపూర్ బడి నిండా సమస్యలు: సృజన యాదవ్
TG· 3h ago

మల్కాపూర్ బడి నిండా సమస్యలు: సృజన యాదవ్

TG: ఆదివాసీ గ్రామాల్లోని పిల్లల పరిస్థితులు చూస్తే బాధగా ఉందని సృజన యాదవ్ అన్నారు. TPF<a href="https://www.theclearcutnews.com/n/Aq6od2X"> విద్యా బస్సుయాత్ర</a>లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా మల్కాపూర్‌లో ఆమె మాట్లాడుతూ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు తరగతులు ఉన్నాయని చెప్పారు. ఇద్దరు టీచర్లు, రెండు గదులు ఉండగా ఒక గదిలో సామగ్రి ఉండటంతో పిల్లలు వరండాలో కూర్చొని చదువుకుంటున్నారని తెలిపారు. నాలుగు బాత్రూమ్‌లలో మూడు పనిచేయడం లేదని, నల్లాలు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు. ఇద్దరు టీచర్లలో ఒకరు సెలవులో ఉంటే ఒక్క టీచర్‌తోనే పాఠశాల కొనసాగుతోందన్నారు.