← Back to news

షాకింగ్.. బైక్ ఇంజిన్‌లో నాగుపాము

By DK· 21 Jul 2026· కరీంనగర్ జిల్లా
షాకింగ్.. బైక్ ఇంజిన్‌లో నాగుపాము

TG: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బస్టాండ్‌లో పార్క్ చేసి ఉన్న ఓ బైక్ ఇంజిన్‌లో భారీ నాగుపాము కనిపించడంతో కలకలం రేపింది. పామును గమనించిన ప్రయాణికులు భయాందోళనకు గురై వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న స్నేక్ క్యాచర్ చాకచక్యంగా బైక్ ఇంజిన్‌లో నుంచి నాగుపామును సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం దానిని పట్టణ శివారులోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ఘటనతో బస్టాండ్‌లో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. వర్షాకాలంలో పాములు వాహనాల్లోకి చేరే అవకాశం ఉన్నందున, పార్క్ చేసిన వాహనాలను స్టార్ట్ చేసే ముందు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని స్నేక్ క్యాచర్ సూచించారు.

More in TG