← Back to news

గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్

By DeeK· 5 Jul 2026· రాజమహేంద్రవరం
గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్

AP: వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జరగనున్న గోదావరి పుష్కరాలకు ప్రాథమికంగా రూ.1,500 కోట్లు కేటాయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులకు అదనంగా అర్బన్ ఛాలెంజ్ ఫండ్(UCG), అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్(UIDF), యాన్యుటీ మోడల్ కింద రూ.580 కోట్లను రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు ఇస్తామన్నారు. అభివృద్ధి పనుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

More in AP