పెట్టుబడుల పేరుతో భారీ సైబర్ మోసం

TG: హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఫేస్‌బుక్‌లో అధిక లాభాలు వస్తాయని ఇన్వెస్ట్‌మెంట్ యాడ్ చూశాడు. యాడ్‌పై క్లిక్ చేయడంతో సైబర్‌నేరగాళ్లు అతడిని సంప్రదించారు. ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని నమ్మించి వాట్సాప్ గ్రూపుల్లో చేర్చారు. మోసగాళ్లు సూచించిన బ్యాంక్ అకౌంట్లకు మొత్తం రూ.2.22 కోట్లను ట్రాన్స్‌ఫర్ చేశాడు. నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ యాప్ డ్యాష్‌బోర్డ్‌లో అతని అకౌంట్‌లో రూ.3.1 కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్లు చూపించారు. ఆ డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు ఉద్యోగి పయత్నించగా రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.



