బ్రిడ్జిపై వేలాడుతూ ఆత్మహత్య బెదిరింపు

AP : తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ఉదయం 5 గంటల నుంచి ఓ వ్యక్తి ఫుట్‌పాత్ బ్రిడ్జిపై వేలాడుతూ ఆత్మహత్య చేసుకుంటానని హల్‌చల్ చేశాడు. దీంతో ఆ ఏరియాలో ఉద్రిక్తత నెలకొంది. రైల్వే అధికారులు వెంటనే హైటెన్షన్ పవర్ సప్లై నిలిపివేసి ఆ వ్యక్తిని కాపాడారు. ఈ ఘటన వల్ల తిరుపతి నుంచి రేణిగుంట మీదుగా చెన్నై, హైదరాబాద్, విజయవాడ వెళ్లే రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.



