కారులో నుంచి తోసేసి 14లక్షలతో పరారైన దోపిడి ముఠా

AP: తిరుపతి జిల్లా తడ మండలం వెల్లూరుపాడు విలేజ్‌కు చెందిన రవిచంద్రారెడ్డికి రూపాయికి మూడు రూపాయలు ఇస్తామంటూ ఓ ముఠా సభ్యులు నమ్మించారు. నగదుతో వెళ్తున్న రవి చంద్రారెడ్డిని ముఠా సభ్యులు ఏర్పేడు మేర్లపాక వద్ద కారులో ఎక్కించుకుని రూ.14 లక్షల నగదును లాక్కొని, ఆర్ మల్లవరం వద్ద కారు నుంచి తోసేసి పరారయ్యారు. రవిచంద్రారెడ్డి ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏర్పేడు పోలీసులు చిల్లకూరుకు చెందిన శ్రీనివాసులను, జీవకోనకు చెందిన గుణశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నగదుతో పరారైన లక్ష్మీప్రియ, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.



