← Back to news

అప్పులు తీర్చలేక ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

By DK· 22 Jul 2026· మేడ్చల్ జిల్లా
అప్పులు తీర్చలేక ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

TG: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన మేకల శివకుమార్(21) మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని దేవేందర్ నగర్‌లో ఉంటూ మైసమ్మగూడలోని ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. జల్సాలకు అలవాటు పడి ఫ్రెండ్స్‌తో పాటు ఇతరుల వద్ద అప్పులు చేశాడు. వారు తిరిగి అడగడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. తల్లిదండ్రులను డబ్బు అడిగితే తిడతారనే భయంతో గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేట్‌బషీరాబాద్ SI రాజు తెలిపారు.

More in TG