ఒకే ఇంట్లో ముగ్గురు మహిళల సూసైడ్

AP: కృష్ణా జిల్లా గూడూరు మండలం అనంతయ్యపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు సూసైడ్ చేసుకున్నారు. హనుమకొండ రజిని, మధుబాల, గౌరీదేవి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఆమె ఇద్దరు కుమార్తెలుగా పోలీసులు గుర్తించారు. డెడ్‌బాడీలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలు లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై గూడూరు పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు.



