← Back to news

మా డబ్బుతోనే అంత్యక్రియలు చేయండి

By DeeK· 23 Jun 2026· Eenadu· చిత్తూరు జిల్లా
మా డబ్బుతోనే అంత్యక్రియలు చేయండి

AP: చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మండిపేటకోటూరుకు చెందిన దామోదరం(35), నిర్మల(28)లకు దిలీప్(12), శ్రీవిద్య(10) సంతానం. నిర్మల బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతుంది. అప్పటికే అప్పులు పెరిగిపోయాయి. CMRF నుంచి రూ. లక్ష వచ్చినా సరిపోలేదు. ఇటీవల చెన్నైలోని ఓ హాస్పిటల్‌కు వెళ్లగా రూ.7లక్షలు ఖర్చవుతుందని, అయినా కోలుకుంటారనే నమ్మకంలేదని డాక్టర్స్ చెప్పారు. దీంతో భార్యాభర్తలు కుంగిపోయారు. ఇద్దరు చిన్నారులకు నిర్మల విషం తాగించి తర్వాత తానూ తాగింది. దామోదరం ఉరేసుకున్నాడు. అంత్యక్రియలకు తమ డబ్బులే వినియోగించాలని కాగితంపై రాసి పెట్టారు.

మా డబ్బుతోనే అంత్యక్రియలు చేయండి

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 23h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.