← Back to news

నీటి గుంతలో పడి అక్కాచెల్లెళ్లు మృతి

By DK· 5 Jun 2026· Dishadaily· కడప జిల్లా
నీటి గుంతలో పడి అక్కాచెల్లెళ్లు మృతి

AP: కడప జిల్లా కాజీపేట మండలం దుంపలగట్టులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఆడపిల్లలు నీటి గుంతలో పడి మృతి చెందారు. దుంపలగట్టు విలేజ్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు సంజన(18), అర్చన (14) తమ పందులకు నీళ్లు తాపడం కోసం పొలం పరిసరాల్లోకి వెళ్లారు. అక్కడ ఉన్న నీటిగుంతలో ఒకరు పడిపోగా, వారిని రక్షించే క్రమంలో మరొకరు మునిగిపోయారు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో ఊపిరాడక ప్రాణాలు విడిచారు. గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఇద్దరి డెడ్‌బాడీలను బయటకు తీశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.