← Back to news

గ్రామంలో షాకింగ్ సీన్.. వాగులో క్షుద్రపూజలు

By dk· 13 Aug 2026· జయశంకర్ భూపాలపల్లి జిల్లా
గ్రామంలో షాకింగ్ సీన్..  వాగులో క్షుద్రపూజలు

TG: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కుదురుపల్లి వాగులో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పూజలు చేసినట్లు గ్రామస్థులు గుర్తించారు. నల్లకోడి, నిమ్మకాయలు, కోడిగుడ్డు, పసుపు, కుంకుమ వంటి వస్తువులు అక్కడ కనిపించాయి. గురువారం ఉదయం వాగువద్దకు వెళ్లిన స్థానికులు విషయాన్ని గుర్తించి గ్రామస్థులకు సమాచారం అందించారు. దీంతో వారిలో భయాందోళన నెలకొంది. అదేవిధంగా కాటారం మండలం మద్దులపల్లి గ్రామంలోనూ రోడ్డుపై ముగ్గు, నిమ్మకాయలు, కోడిగుడ్లతో పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో ఆందోళన చెందుతున్నారు.

More in TG