← Back to news

మల్కాజిగిరిలో కాల్పుల కలకలం

By DK· 10 Jun 2026· Dishadaily· హైదరాబాద్‌
మల్కాజిగిరిలో కాల్పుల కలకలం

TG: మేడ్చల్ జిల్లాలోని మల్కాజిగిరిలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. మల్కాజిగిరి మున్సిపాలిటీ పరిధిలోని మారుతినగర్‌లో నిషారాణి, అరుణ్ దంపతులు నివాసముంటున్నారు. వీరి మధ్య గత కొంతకాలంగా తీవ్ర మనస్పర్థలు, విభేదాలు నడుస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందామని నిషారాణికి అరుణ్ చెప్పాడు. ఆమెను నమ్మించి, తనతో పాటు మరో వ్యక్తిని వెంటబెట్టుకుని వచ్చాడు. అరుణ్ తన వద్ద దాచుకున్న తుపాకీతో నిషారాణిపై కాల్పులు జరిపాడు. నిషారాణి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.