← Back to news

షాకింగ్.. కొబ్బరిబొండమే ఇద్దరి ప్రాణాలు తీసింది

By డీకే· 4 Jul 2026· విశాఖపట్నం జిల్లా
షాకింగ్.. కొబ్బరిబొండమే ఇద్దరి ప్రాణాలు తీసింది

AP: రాజమహేంద్రవరానికి చెందిన పురోహితుడు దువ్వురి హరిప్రసాద్(52) చిన్న కుమారుడి వివాహం హైదరాబాద్‌లో జరిగింది. వివాహ వేడుకలు ముగించుకుని హరిప్రసాద్ తన కారు వెనుక సీట్లో పూజాసామాగ్రితో రాజమహేంద్రవరం తిరుగు ప్రయాణమయ్యారు. గొల్లపూడి బైపాస్ రోడ్డు సమీపంలో కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టి, ఆపై రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. హరిప్రసాద్ స్పాట్‌లోనే మృతి చెందగా, బైక్‌పై ఉన్న వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. కొబ్బరిబొండం డ్రైవింగ్ సీట్ కింద ఉన్న బ్రేక్, క్లచ్ పెడల్స్ మధ్య ఇరుక్కోవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

More in AP