చెట్ల నరుకుతుండగా కరెంట్ షాక్.. స్పాట్‌డెడ్!

హైదరాబాద్ అల్వాల్‌లోని MES కాలనీలో ఘోర ప్రమాదం జరిగింది. చెట్ల కొమ్మలు నరుకుతుండగా కరెంట్ తీగలు తగిలి సూర్యనారాయణ అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కరెంట్ సప్లై ఆపకుండానే చెట్లు నరకాలని చెప్పడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, ఇది ముమ్మాటికీ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమేనని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరణించిన సూర్యనారాయణకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.



