రన్నింగ్ ఆటోలో పాము.. దూకేసిన కూలీలు

TG: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్సా గ్రామంలో ఉపాధి హామీ కూలీలు తమ పనులను ముగించుకుని ఆటోలో తిరిగి ఇంటికి వెళ్తున్నారు. కూలీలు ప్రయాణిస్తున్న ఆటోలోకి పాము కన్పించడంతో షాక్‌కు గురై టెన్షన్ పడ్డారు. ప్రాణభయంతో స్పీడ్‌గా వెళ్తున్న రన్నింగ్ ఆటో నుంచి కూలీలు కిందకు దూకేశారు. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్‌లో చెన్నూర్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు.



