మద్యం మత్తులో వైద్యం.. బాలిక మృతి

TG: మద్యం మత్తులో RMP డాక్టర్ చికిత్స చేయడంతో బాలిక మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో కలకలం రేపింది. బస్వాపురానికి చెందిన హిమశ్రీ(16) జలుబు, దగ్గుతో బాధపడుతుండటంతో తండ్రి స్థానిక ఆర్ఎంపీ మారుతిసంపత్ వద్దకు తీసుకెళ్లారు. మద్యంమత్తులో డాక్టర్, బాలికకు ఇంజక్షన్ ఇచ్చినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. మరో ఇంజక్షన్ ఇస్తుండగా ఆమె నోటినుంచి నురగలు వచ్చి స్పృహ కోల్పోయింది. అనంతరం ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



