చిన్నపాము అని ఆటాడితే ప్రాణం తీసింది

TG: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఖాద్రీహిల్స్‌కు చెందిన సయ్యద్ మొహిద్దీన్ హుస్సైనీ(30) వ్యాపారవేత్త. ఆయనకు మొయినాబాద్‌లో ఫాంహౌస్ ఉంది. ఆయన ఫ్రెండ్స్‌తో కలిసి అక్కడికి వెళ్లారు. ఫాంహౌస్‌లోకి చిన్న కట్లపాము రావడంతో చేతితో పట్టుకొని మొహిద్దీన్ అందరినీ భయపెట్టాడు. పాము కుడిచేతి వేలును నోటితో గట్టిగా పట్టుకొంది. కరుస్తోందని పక్కనున్నవారు చెప్పినా తనకు ఏంకాదని చెప్పాడు. శరీరంలో మార్పులు రావడంతో మెహిదీపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లగా డాక్టర్స్ ఇంజక్షన్ ఇచ్చారు. తర్వాత ఉస్మానియా హాస్పిటల్‌కు తీసుకెళ్లగా మొహిద్దీన్ మృతి చెందినట్లు డాక్టర్స్ తెలిపారు.




