తిరుమలలో నకిలీ ఆధార్ ముఠా అరెస్ట్

AP: నకిలీ ఆధార్ కార్డులతో TTD వసతి గదులను అక్రమంగా పొంది, వాటిని భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను తిరుమల టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. తిరుమల CRO కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురిని TTD సిబ్బంది గుర్తించి పోలీసులకు అప్పగించారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది. వీరు మొబైల్ యాప్‌ల ద్వారా నకిలీ ఆధార్ కార్డులను సృష్టించి గదులు పొందుతున్నట్లు, ఆపై వాటిని భక్తులకు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. వీరి సమాచారంతో మరో నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు.



