← Back to news

హైకోర్టు ఆదేశాల తర్వాత ఏవీ రంగనాథ్ రియాక్షన్

By Mahesh· 28 Jul 2026
హైకోర్టు ఆదేశాల తర్వాత ఏవీ రంగనాథ్ రియాక్షన్

TG: తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలన్న ఆదేశాలకు ఆయన స్పందించారు. గత రెండేళ్లుగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కుల పరిరక్షణ కోసం హైడ్రా పనిచేసిందని చెప్పారు. బడా భూకబ్జాదారులు ఆక్రమించిన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించినట్లు రంగనాథ్ పేర్కొన్నారు. తనపై ప్రస్తుతం 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయని, అవన్నీ భూకబ్జాదారులు ఫైల్ చేసినవేనని అన్నారు. ఈ కేసులని చట్టపరంగానే ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.

More in News