నకిలీ పత్రాలతో మోసం.. తండ్రీకొడుకుల అరెస్ట్

AP: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామానికి చెందిన శ్యామల నర్సారెడ్డి, అతని కుమారుడు శ్యామల గోపీచంద్ రెడ్డి కలిసి మంగళగిరి పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకే ప్లాట్స్ ఇప్పిస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. నూతక్కి గ్రామానికి చెందిన సంజీవరెడ్డి నుంచి రూ.20 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుని, వేరొకరి సంతకాలతో నకిలీ విక్రయ ఒప్పంద పత్రాలను సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా పలువురి నుంచి సుమారు రూ.75 లక్షలు మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. తండ్రీకొడుకులను అరెస్ట్ చేశారు.



