← Back to news

సందడి మాటున బంగారు గొడుగు ఎత్తుకెళ్లిన దొంగలు

By DK· 28 Jun 2026· నంద్యాల జిల్లా
సందడి మాటున బంగారు గొడుగు ఎత్తుకెళ్లిన దొంగలు

AP: నంద్యాల జిల్లా ఔకు మండల కేంద్రంలో మౌలాలి స్వామి పీరుకు అలంకరించిన బంగారు గొడుగును దొంగలు అపహరించారు. సుమారు రూ.2 లక్షల విలువైన 13 గ్రాముల బంగారు గొడుగును గుట్టుచప్పుడు కాకుండా చోరీ చేశారు. నైలాన్ ధారంతో కట్టిన బంగారు గొడుగును బ్లేడుతో కత్తిరించి కొట్టేశారు. మౌలాలి స్వామి పీర్ల చావిడి వద్ద సందడి ముసుగులో హల్‌చల్ చేసిన ఆకతాయిలు, మందుబాబులపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మౌలాలి స్వామి పీర్ల చావిడి ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 21h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.