← Back to news

కవర్‌ను తొలగిస్తుండగా కరెంట్ షాక్.. డ్రైవర్ స్పాట్‌డెడ్

By dk· 17 Jun 2026· Dishadaily· నారాయణపేట్ జిల్లా
కవర్‌ను తొలగిస్తుండగా కరెంట్ షాక్.. డ్రైవర్ స్పాట్‌డెడ్

TG: నారాయణపేట్ జిల్లా గద్వాల్ మున్సిపాలిటీలోని దౌదర్పల్లి 7వ వార్డు ఇందిరమ్మ కాలనీకి చెందిన కుర్వ వెంకటేష్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం గద్వాల్ నుంచి మక్తల్‌కు మసాలా ప్యాకెట్ల లోడ్‌తో వచ్చిన లారీపై కప్పిన ప్లాస్టిక్ కవర్‌ను తొలగిస్తుండగా కిందకు వేలాడుతున్న కరెంట్ వైర్లు తగిలాయి. కరెంట్ షాక్‌కు గురై వెంకటేష్(25) స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్యతో పాటు నాలుగేళ్ల కుమార్తె ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.