సాయం చేద్దామని వెళ్లి గోదావరిలో గల్లంతు

AP: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రుద్రంకోట విలేజ్‌కు చెందిన కనితిరెడ్డి రాంబాబు, హేమంత్‌కుమార్ స్నేహితులు. హేమంత్‌కుమార్‌కు చెందిన గేదెలు రుద్రమ్మకోట సమీపంలో గోదావరి నది అవతలి ఒడ్డుపై ఉన్నాయి. వాటిని తోలుకు వచ్చేందుకు హేమంత్, ఆయనకు సాయం చేసేందుకు రాంబాబు కలిసి లోతు తక్కువ ఉండే వైపు నడిచివెళ్లారు. తిరిగి గేదెలను ఇంటికి తీసుకొచ్చే క్రమంలో రాంబాబు లోతు ఎక్కువగా ఉండే వైపు వెళ్లి గల్లంతయ్యాడు. గల్లంతైన రాంబాబు కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. అయినా మృతదేహం ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.



