← Back to news

బ్యాంకిపూర్ బీజేపీ చేయిజారినట్టేనా?

By Vishi· 3 Aug 2026· Theprint· Bihar
బ్యాంకిపూర్ బీజేపీ చేయిజారినట్టేనా?

బిహార్ రాష్ట్రంలోని బ్యాంకిపూర్ సీటు మీద బీజేపీ ఆశలు సన్నగిల్లుతున్నాయి. జన్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిశోర్ సుమారు 12 వేల ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. బీజేపీకి బలమైన కోటగా ఉన్న ఈ ప్రాంతాన్ని గతంలో పాట్నా వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంగా పిలిచేవారు. ఈ నియోజకవర్గంలో 25 శాతం కంటే ఎక్కువ మంది ఓటర్లు కాయస్థులున్నారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ రిజైన్ చేసిన తర్వాత నీరజ్ కుమార్ సిన్హాను ఇక్కడ నుంచి పోటీలో నిలబెట్టారు. అటు ప్రశాంత్ కిశోర్‌కీ, ఇటు నీరజ్ కుమార్‌కీ ఇవే తొలి ఎన్నికలు కావడం విశేషం.

More in India