మాచర్ల సమీపంలో ఘోర రోడ్ యాక్సిడెంట్

AP: పల్నాడు జిల్లా మాచర్ల సమీపంలో ఘోర రోడ్ యాక్సిడెంట్ జరిగింది. నగరవనం వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు స్పాట్‌లోనే మృతిచెందగా, పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు, ఇతర వాహనదారులు వెంటనే 108, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను మాచర్ల గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. వీరు హైదరాబాద్ నుంచి పామురు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.



